బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారి దర్శనం

11-10-2026 | 06:21pm

ఉమ్మడి నిజాంసాగర్ మండలంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం...

నిజాంసాగర్, అక్టోబర్ 11(విజయక్రాంతి ): ఉమ్మడి నిజాంసాగర్ మండలంలో(Nizamsagar Mandal) శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో(Devotional) ఘనంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల(Sharannavaratri celebrations) సందర్భంగా పురోహితులు సంజీవరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ పట్లోళ్ల జ్యోతి, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

తొలిరోజు నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు