విజయ దేవిని సన్మానించిన సునీల్ రావు
05-10-2026 | 05:13pm
ముకరంపుర, అక్టోబర్ 5 (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా నియమితులైన గుగులోతు విజయదేవిని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) శాలువాతో సత్కరించిన అనంతరం మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, ఎస్టీ మోర్చా బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.