ట్రాన్స్ జెండర్లకు గౌరవం, సమాన హక్కులు కల్పించాలి

24-10-2026 | 06:46pm

- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్

కరీంనగర్, అక్టోబరు 24 (విజయక్రాంతి): సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు(Equal Rights), గౌరవం, ఆత్మగౌరవంతో జీవించే అవకాశాలు కల్పించాలని, ట్రాన్స్ జెండర్ల(Transgender) పట్ల వివక్షను తొలగించి వారిని సమాజంలో అంతర్భాగంగా గుర్తించాలని కరీంనగర్ జిల్లా(Karimnagar District) న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యశ్వంత్ సింగ్(Yashwant Singh) అన్నారు. కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకారంతో ఇండియా హెచ్ఐవీ ఎయిడ్స్ అలయన్స్ సంస్థ మద్దతుతో చేతన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని సాహస్ ప్రాజెక్టు ద్వారా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ సభ్యుల కోసం అవగాహన, స్టేక్హోల్డర్ల సెన్సిటైజేషన్ సమావేశాన్ని నిర్వహించారు.

ముఖ్య అతిథుగా హాజరైన మాట్లాడుతూ  ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల(Skill development programs) గురించి కమ్యూనిటీ సభ్యులకు అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు. సంబంధిత శాఖలను సంప్రదించి, అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాలను అర్హులైన ట్రాన్స్జెండర్లు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజగోపాల్ రావు, పోలీస్ ఇన్స్పెక్టర్ పుల్లయ్య, జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి, చేతన స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కోట శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు