ప్రజాధనం వృథా.. రావణాసుర దహనంలో నాణ్యతా లోపాలు!
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి ప్రజా సంఘాల నాయకుడు వేల్పుల ప్రభాకర్
హుజురాబాద్,(విజయక్రాంతి): రావణాసుర దహనం(Ravanasura Dahanam) కార్యక్రమం నిర్వహించవద్దని, ప్రజాధనాన్ని వృథా చేయొద్దని ముందుగానే పాలకమండలి, అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ప్రజా సంఘాల నాయకుడు వేల్పుల ప్రభాకర్(Huzurabad leader Velpula Prabhakar) విమర్శించారు. దసరా రోజు నిర్వహించిన రావణాసుర దహనంలో నాణ్యతలేని బాణసంచా వినియోగం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రావణాసురుడి బొమ్మ పూర్తిగా దహనం కాకుండా తల భాగాలు మిగిలిపోయాయని ఆరోపించారు.
ఈ ఘటనకు బాధ్యత ఎవరు వహిస్తారని, ప్రజాధనంతో జరిగిన నష్టాన్ని ఎవరు భరిస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా హుజురాబాద్ పట్టణ ప్రజలు పాలకులు, అధికారులను నిలదీయాలని, ప్రజాధనానికి జవాబుదారీతనం ఉండేలా ప్రశ్నించాలని వేల్పుల ప్రభాకర్ పిలుపునిచ్చారు.