దుర్గామాతకు ఎమ్మెల్యే గంగుల పూజలు

13-10-2026 | 06:05pm

ముకరంపుర, అక్టోబర్ 13(విజయ క్రాంతి) జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్‌లో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శివాజీ యూత్‌ ఆధ్వర్యంలో(Under the aegis of Shivaji Youth) ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌(MLA Gangula Kamalakar) మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు