రంగపేటలో నూతన వస్త్రాలంకరణ వేడుక

29-10-2026 | 08:03pm
  1. హాజరైన ఎమ్మెల్యే కవ్వంపల్లి 
  2. లాస్యకు శుభాశీస్సులు అందజేత

మానకొండూరు, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొమ్ము అంజలి–చంద్రయ్య దంపతుల కుమార్తె లాస్య నూతన వస్త్రాలంకరణ వేడుకకు గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ(Dr. Kavvampalli Satyanarayana) హాజరయ్యారు. 

ఈ సందర్భంగా లాస్యను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేవెల్లి రాజలింగం,

వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాస్ రెడ్డి, మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లు మర్రి ఓదెలు యాదవ్, రామిడి తిరుమల్ రెడ్డి, ఊటూర్ పీఏసీఎస్ చైర్మన్ ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు గుడాల మహేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర శ్రీధర్ గౌడ్, గోపు శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరై లాస్యకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు