రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
చొప్పదండి,(విజయక్రాంతి): కరీంనగర్‌లోని మానేరు డ్యామ్ సమీపంలో గల ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఈరోజు నిర్వహించిన అండర్-19 ఎస్.జి.ఎఫ్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్(U-19 SGF District Athletics) పోటీల్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక్ స్కూల్(Telangana Social Welfare Residential Sainik School), రుక్మాపూర్ విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం ఐదు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.
బంగారు పతకాలు:
- ఆర్. అభిషేక్ – 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్
- పి. జెశ్వంత్ – 200 మీటర్ల పరుగు
- డి. సిద్ధార్థ – 400 మీటర్ల పరుగు
- వెండి పతకాలు:
- డి. వర్షిత్ – 400 మీటర్ల పరుగు
- జి. మనోహర్ – 5 కిలోమీటర్ల పరుగు
ఈ సందర్భంగా విజేత విద్యార్థులను, వారికి శిక్షణనిచ్చిన పీఈటీలు సుమన్, విక్రమ్‌లను పాఠశాల డైరెక్టర్ రాజదత్త, ప్రిన్సిపాల్ పి. దేవేందర్, ఎస్‌వీపీ కె. శ్రీనివాస్, జేవీపీ ప్రమోద్ రాజ్, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.