పిల్లలతోఅల్పాహారం చేసిన గ్రామ సర్పంచ్
చొప్పదండి 06( విజయక్రాంతి) : చొప్పదండి మండలం(Choppadandi Mandal) కొలిమికుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో(Government School) పిల్లలతో అల్పాహారం చేసిన కొలిమి కుంట గ్రామ సర్పంచ్ చొక్కాల తిరుపతి పిల్లలతో కలిసి అల్పాహారం చేసినా డు పాఠశాలలోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలలో((Government School)) పిల్లలకు ప్రతి రోజు ఉదయం అల్పాహారం అందించడం జరిగింది ఇట్టికార్యక్రమంలో భాగంగా కొలిమికుంట సర్పంచ్ మాట్లాడుతూ పిల్లలకు ప్రతిరోజు అల్పాహారం అందించడం వల్ల శరీరకంగా బలంగా ఎదుగుతారని అన్నారు మరియు జ్ఞాపకశక్తి పెంపొందించి పిల్లలు ఉత్సాహంగా ఉంటారని అన్నారు.
ఈ విధంగా మన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల గ్రామ పిల్లలందరూ వేరే పాఠశాలలకు పోకుండా గ్రామ పాఠశాలలను చదువుకోవాలని కోరినారు మరియు అనేక వసతులను మన ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు సిబ్బంది గ్రామ నాయకులు తదితరులు తల్లిదండ్రులు పాల్గొన్నారు