దుర్గామాత అమ్మవారికి పూజలు

12-10-2026 | 08:21pm

దుర్గామాత  అమ్మవారికి పూజలు

ముకరంపుర,(విజయక్రాంతి): శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో(Sri Durga Devi Sharannavaratri celebrations) భాగంగా సోమవారం కరీంనగర్ లోని భగత్ నగర్ లో ప్రతిష్టించిన పలు దుర్గామాత మండపాలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భగత్ నగర్ లోని క్యాంపు కార్యాలయం వద్ద భగత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, చైతన్య యూత్ క్లబ్ మరియు ఆదర్శ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, కాలనీవాసులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు