ఈవీఎం గోదాం పంపి చేసిన కలెక్టర్
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సోమవారం తనిఖీ చేశారు. గోదాంలోని రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, అగ్నిమాపక వ్యవస్థల సన్నద్ధతను సమీక్షించారు. ఈవీఎం గోదాం వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిరంతరం కొనసాగించాలని సూచించారు.
పోలీసు సిబ్బంది సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన పరికరాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి లోపాలకు తావులేకుండా చూడాలని సూచించారు. ఈ తనిఖీలో ఇన్చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, డీపీఆర్వో ఇ. విష్ణువర్ధన్, తహసీల్దార్ రాజు, అధికారులు స్వాతి, పోలీసు, అగ్నిమాపక శాఖల సిబ్బంది పాల్గొన్నారు.