గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సమస్యలు
కొత్తపల్లి, అక్టోబర్ 29(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్(Dr. Kommu Ashok Yadav) అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం గురువారం రోజున హిమాయత్ నగర్ అమృత ఎస్టేట్స్ చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో(State Office of the Artisans' Association) జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా నుండి హాజరైన రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ,చేనేత,గీత వృత్తిదారులకు ఇచ్చినట్లుగా గొల్ల కురుమలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని, ఆసరా పెన్షన్ ను 5వేలకు పెంచి అమలు జరపాలన్నారు.
సమస్యల పరిష్కారానికై వృత్తిదారులంతా ఐక్యంగా పోరాడాలన్నారు.జీవో నెంబర్ 559, 1016 ల ను రాష్ట్ర ప్రభుత్వం సవరించి తెలంగాణ రాష్ట్రంలోనిప్రతి గ్రామంలో గొర్రె పెంపకం దారులకు గొర్రెలు మేకల మేత కొరకు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే కేటాయించాలని బుచ్చన్న యాదవ్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోడంగి శ్రావణ్ కుమార్ యాదవ్, బాలయ్య యాదవ్, జిల్లాల అధ్యక్షులు చిల్లారపు సంతోష్ యాదవ్, గజ్జి రమేష్ యాదవ్ వేల్పుల సారంగపాణి యాదవ్,అందే అశోక్ యాదవ్, సంఘం నాయకులు మద్దూరి గట్టయ్య,దాడి రాజబాబు యాదవ్ మరియు కేశవేణి సత్యనారాయణ యాదవ్ పాల్గొన్నారు.