జాతీయ స్థాయి రీజినల్ గణిత ఒలింపియాడ్ కు పారమిత విద్యార్థి
కొత్తపల్లి, అక్టోబరు 24 (విజయక్రాంతి): పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల(Padmanagar Paramita Heritage School) విద్యార్థి పబ్బతి విద్వాన్ రెడ్డి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి 'రీజినల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్(Regional Mathematical Olympiad)' కు ఎంపికయ్యాడు. ఈనెల 6న దేశవ్యాప్తంగా నిర్వహించిన ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైయర్ ఇన్ మ్యాథమెటిక్స్(Indian Olympiad Qualifier in Mathematics)(ఐఓక్యుఎం) పరీక్షలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయ స్థాయి పరీక్షకు(National-level examination) అర్హత సాధించడాని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థి విద్వాన్ రెడ్డిని, గైడ్ టీచర్లు సంపత్, ప్రదీప్, అకడమిక్ కోఆర్డినేటర్ నాగరాజులను విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ ఇ ప్రసాద్ రావు, డైరెక్టర్స్ ప్రసూన, అనుకర్ రావు, రష్మిత, రాకేశ్, వియుమ్ ప్రసాద్, వినోద్ రావు, హన్మంత రావు, ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ అభినందిoచారు.