దేశ జనాభా గణనలో బీసీ కులాల గణనకు ప్రత్యేక గడులు ఏర్పాటు చేయాలి
జడ్చర్ల, అక్టోబర్ 23: మండల విద్యా వనరుల కేంద్రం(Educational Resources Center) ఆవరణలో శనివారం నాడు ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్(Burgupalli Krishna Yadav) మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2027 జనవరి నుండి చేపట్టబోయే దేశ జనాభా గణనలో(National census) రాష్ట్రాల వారీగా బీసీ కులాల గణనకు ప్రత్యేక గడులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాల జనాభా, వారి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి(Economic, educational, and employment) పరిస్థితులకు సంబంధించిన కచ్చితమైన వివరాలు సేకరించాలంటే కులాలవారీగా గణన చేపట్టడం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రాల వారీగా బీసీ కులాల వివరాలను నమోదు చేయడంతో పాటు, ప్రతి కులానికి సంబంధించిన జనాభా గణాంకాలను స్పష్టంగా వెల్లడించాలని కోరారు.
దేశ జనాభాలో బీసీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల వాస్తవ జనాభా ఎంత ఉందో అధికారికంగా లెక్కలు తేలితేనే వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సంక్షేమ పథకాలు, విద్యా, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు వీలవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో బీసీ జాగృతి సేన రాష్ట్ర కార్యదర్శి రఘునందనచారి,విద్యార్థి సంఘము జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు వెంకటేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, మండల కార్యదర్శి చెన్నయ్య, శివ శంకర్, నియోజకవర్గం కార్యదర్శి, రామస్వామి. రమేష్ తదితరులు పాల్గొన్నారు.