ప్రభుత్వ భూములను కాపాడాలి

05-10-2026 | 05:05pm

బచ్చోడును మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి

తిరుమలాయపాలెం, అక్టోబర్ 5 (విజయక్రాంతి): కాకరవాయి గ్రామకంఠం ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఏఐపీకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు(AIPKMS District Secretary Thimmidi Hanumantharao) డిమాండ్ చేశారు.

సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీజకు ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. అలాగే బచ్చోడును నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని, అక్కడ ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. బచ్చోడులో బ్యాంకు ఏర్పాటుపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తామని ఎస్‌బీఐ ప్రాంతీయ మేనేజర్ రామ్మూర్తి తెలిపినట్లు హనుమంతరావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు