కోతుల దాడి భయంతో ఆగిన బాలుడి గుండె

23-10-2026 | 11:02pm

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లపురంలో ఘటన

సూర్యాపేట, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : కోతుల గుంపు(troop of monkeys) దాడి చేయడంతో భయాందోళనకు గురైన 12 ఏళ్ల బాలుడు పరుగులు తీస్తూ కింద పడటంతో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) నడిగూడెం మండలం వల్లపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మొక్క వీరబాబు కుమారుడు నిశాంత్ గౌడ్(Nishanth Goud) (12) శుక్రవారం సాయంత్రం ఆడుకునేందుకు వెళ్తుండగా కోతుల గుంపు వెంట పడ్డాయన్నారు. కోతుల దాడితో భయపడిన బాలుడు పరుగులు తీస్తూ బోర్ల పడిపోయాడన్నారు.

దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి(Hospital) తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడని తెలిపారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి(Kodad Government Hospital) తరలించారన్నారు. గ్రామంలో కోతుల బెడదను(Monkey Menace) నివారించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అయితే ఘటనకు సంబంధించిన  వివరాలు పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు