అయ్యప్ప పడిపూజకు వచ్చి ఆభరణాల చోరీ
నిందితుడి అరెస్ట్.
కూకట్ పల్లి, అక్టోబర్ 23,( విజయక్రాంతి): అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమానికి(Ayyappa Swamy Padi Puja Program) సహాయక పూజారిగా వచ్చి ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసిన నిందితుడిని సిసిఎస్ కూకట్ పల్లి, కెపిహెచ్బి క్రైమ్ పోలీసుల(KPHB Crime Police) సంయుక్త బృందం శుక్రవారం అరెస్టు చేసింది. నిందితుడి నుండి రూ. 2.80 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో(Gold and silver ornaments) పాటు మొబైల్ ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధి సర్దార్ పటేల్ నగర్ లోని ఈడెన్ హోమ్స్ లో నివాసముంటున్న భువనగిరి రాధిక(Bhuvanagiri Radhika) ఇంట్లో ఈనెల 16న అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ప్రధాన పూజారి భార్గవ స్వామి తో పాటు సహాయ పూజారిగా చెన్నబోయిన రాజేందర్ అలియాస్ రాజు హాజరయ్యాడు. పూజా కార్యక్రమం జరుగుతున్న సమయంలో ,దుస్తులు మార్చుకోవడం, వ్యక్తిగత అవసరాల కోసం ఇంటిలోకి అనుమతించారు. అదే రోజు రాత్రి సుమారు 10:40 గంటల సమయంలో కుటుంబ సభ్యులంతా పూజలో నిమగ్నమై ఉండటాన్ని గమనించిన నిందితుడు బెడ్ రూమ్ లోని బీరువాలో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం వాటిని మూసాపేటలోని తన అద్దె ఇంట్లో దాచి పెట్టాడు. అక్టోబర్ 21న ఆభరణాలు నగదు కనబడటం లేదని బాధితురాలు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ లూలూ మాల్ సమీపంలో తక్కువ ధరకు ఆభరణాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న నిందితుడిని సిసిఎస్ కూకట్పల్లి, కెపిహెచ్బి క్రైమ్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి 161. 28 గ్రాముల బంగారు ఆభరణాలు, 34.50గ్రాముల . వెండి ఆభరణాల తోపాటు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.
నిందితుడు చెల్లబోయిన రాజేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లా కురవి మండలం నల్లెల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్ మూసాపేట యాదవ బస్సులో నివాసము అంటూ ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో సనత్ నగర్ మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో నమోదైన ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులలోను అతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.