కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
మధిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది భట్టి విక్రమార్క
బోనకల్ లో అభివృద్ధి చైతన్య ర్యాలీ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం, బోనకల్,(విజయక్రాంతి): గ్రామాలు, పల్లెలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) బోనకల్ మండలంలో చేసిన అభివృద్ధి పనులపై బోనకల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్నాటి రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో 1000 మోటారు సైకిళ్లతో పార్టీ నాయకులు చైతన్య ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బోనకల్ మండలంలోని అన్ని గ్రామాలలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారని, ప్రతి గ్రామానికి గతంలో ఉన్న రహదారి కాకుండా, లింకు రోడ్లు, బీటీ రోడ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అదే విధంగా మండలంలో విద్యుత్ సమస్య తలెత్తకుండా నూతనంగా చిరునోముల,బ్రాహ్మణపల్లి గ్రామాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లు నిర్మాణం తలపెట్టారని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కోట్లాది రూపాయల నిధులతో సీసీ రోడ్లను పూర్తి చేస్తున్నారని తెలిపారు.
భట్టి విక్రమార్క అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రహదారులు, విద్య, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, అందుకు గాను మోటమర్రి గ్రామం నుండి లక్ష్మీపురం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు వరకు భట్టి విక్రమార్కకి కృతజ్ఞతలతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించటం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి కిషోర్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎర్రంశెట్టి సుబ్బారావు, పిల్లలమర్రి నాగేశ్వరరావు, కొమ్మగిరి బిక్షమయ్య, కందుల పాపారావు, భూక్యా భద్రూ నాయక్, పాసంగులపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు.