ఘనంగా బతుకమ్మ వేడుకలు

17-10-2026 | 04:58pm

ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 17, (విజయక్రాంతి): ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో(Illendu Government Area Hospital) బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆసుపత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్(Chandrashekhar) ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఆర్‌ఎంఓ డాక్టర్ హర్షవర్ధన్, నర్సింగ్ సూపరింటెండెంట్ భారతి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు ఆసుపత్రి సిబ్బందికి బతుకమ్మ, దసరా పండుగ(Bathukamma and Dasara festivals) శుభాకాంక్షలు తెలియజేశారు. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పండుగలను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించవచ్చని తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలు ఆహ్లాదకరంగా సాగాయి.

మరిన్ని వార్తలు