Breaking News

కాంగ్రెస్ 1000 రోజుల ప్రజా పాలనపై ఇంటింటి ప్రచారం

09-09-2026 | 06:14pm

సత్తుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) 1000 రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సత్తుపల్లి మండలం(Sathupalli Mandal) కొత్తూరు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటింటి ప్రచారం(door to door campaigning) నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అమలు చేస్తున్న వివిధ పథకాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను ప్రజలకు తెలియజేశారు.

మరిన్ని వార్తలు