10న జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు

09-09-2026 | 07:10pm

మంచిర్యాల క్రైమ్,(విజయక్రాంతి): జిల్లా కబడ్డీ అసోసియేషన్(District Kabaddi Association) ఆధ్వర్యంలో ఈ నెల 10న సాధన స్పోర్ట్స్ డిఫెన్స్ అకాడమీలో ఖేలో ఇండియా యూత్ అండ్ స్పోర్ట్స్(Khelo India Youth and Sports) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలుర, బాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఈ. రామచందర్ బుధ వారం తెలిపారు. 18 ఏండ్లలోపు ఆసక్తిగల కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనడానికి ఆధార్ కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్ తో పాటు రూ. 200 తీసుకొని ఉదయం 9 గంటలకు కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కార్తీక్ కి రిపోర్టు చేయాలన్నారు. బాలురు 75 kg, బాలికలు 65 kg బరువు ఉండాలన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు ఈ నెల 12 న హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు క్రీడాకారులతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 99120 29691లో సంప్రదించవచ్చన్నారు.

మరిన్ని వార్తలు