డెత్ క్లెయిమ్ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేత

22-10-2026 | 09:48pm

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): రాజుపాలెం సొసైటీ పరిధిలో సికేసి రుణం పొందిన స్వర్గీయ స్వర్ణ వెంకట నరసింహారావు  ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, నిబంధనల ప్రకారం మంజూరైన 50 వేల రూపాయలు డెత్ క్లెయిమ్ మొత్తాన్ని ఈరోజు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎర్రుపాలెంలోని డిసిసిబి బ్యాంకులో రాజుపాలెం సొసైటీ అధ్యక్షులు వెన్నపూస కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డెత్ క్లెయిమ్‌ను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆర్థికంగా కొంత ఊరట లభించేలా డెత్ క్లెయిమ్ అందించడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు