అభివృద్ధి అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి

17-09-2026 | 08:03pm

‎అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ముదిగొండ: అభివృద్ధి అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కొనియాడారు. గురువారం చిరుమర్రి చెరువు వద్ద రూ. 2.90 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి పనులకు(development works) రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లాలోని  చిరుమర్రి చెరువును ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం అన్నారు. జిల్లాలో పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, స్థానికులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా చెరువును సుందరీకరిస్తున్నామని స్పష్టం చేశారు.‎

ముదిగొండలో రూ. 40 లక్షలతో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. వనంవారి కృష్టపురం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు(NREGS funds) 20 లక్షలతో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ‎ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాసా చారి, ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, సిపిఓ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు,  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు