టీపీటీఎఫ్ నూతన మండల కమిటీ ఎన్నిక

09-10-2026 | 05:46pm

అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా యాకయ్య, భద్రు 

కూసుమంచి, అక్టోబర్ 9 విజయక్రాంతి: ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణే(Protection of Teachers Rights) ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న టిపిటిఎఫ్ కూసుమంచి మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా యాకయ్య, భద్రులను సంఘం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. స్థానిక కూసుమంచి జిల్లా పరిషత్ హై స్కూల్లో(Kusumanchi Zilla Parishad High School) జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో(General Body Meeting) నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి మనోహర్ రాజు తో పాటు ఉపాధ్యాయ దర్శిని పత్రిక సంపాదకులు నాగిరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మల్లయ్య, వెంగళరావు, మహిళా ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి, ప్రత్యేక అతిథిగా మండల విద్యాశాఖ అధికారి వీరస్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మనోహర్ రాజు మాట్లాడుతూ పాఠశాల విద్యను పరిరక్షించాల్సిన బాధ్యత ఉద్యోగులుగా సంఘాలుగా మనందరిపై ఉందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా నూతన వరవడులను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉపాధ్యక్షులుగా మదనాచారి, స్వరూప, సాయికుమార్, నవీన్ ను ఎంపిక చేశారు.

కార్యదర్శులుగా శంకర్, ఉపేందర్ ,శివరాం ,సలీమా, బిక్షం కొనసాగనన్నారు. అదేవిధంగా ఆడిట్ కమిటీ కన్వీనర్ గా కృష్ణ ప్రసాద్, అకాడమిక్ సెల్ కన్వీనర్గా శీను, జీవోల కమిటీ కన్వీనర్ గా వెంకన్న, సోషల్ మీడియా కన్వీనర్ గా అమృ నియమితులయ్యారు. జిల్లా కౌన్సిలర్లుగా భాస్కర్, వీరన్న నరసింహారావు, సృజన లక్ష్మయ్యలు పనిచేయనున్నారు.

మరిన్ని వార్తలు