ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభల విజయవంతానికి విస్తృత ప్రచారం

22-09-2026 | 10:08pm

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): అఖిల భారత రైతు కూలీ సంఘం(AIKMS) జాతీయ 4వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. గోడరాతలు, నినాదాలతో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా AIKMS పూర్వ రాష్ట్ర నాయకుడు మందుల రాజేంద్రప్రసాద్(Mandula Rajendra Prasad) మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలపై చర్చించి వారి హక్కుల కోసం పోరాటాలను బలోపేతం చేసేందుకు మహాసభలు వేదికగా నిలుస్తాయని తెలిపారు.

రైతులకు గిట్టుబాటు ధర, సకాలంలో ఎరువులు, సాగునీరు, రైతు కూలీల భూమి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఖమ్మంలో జరిగే మహాసభలకు రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొర్రెపాటి వీరస్వామి, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్, షబ్బీర్, చారి, కృష్ణ, శ్రీనివాసరెడ్డి, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు