హున్సా సబ్‌స్టేషన్‌కు 2మెగావాట్ల సౌర విద్యుత్ అనుసంధానం
బోధన్, సెప్టెంబరు 22(విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని హున్సా 33/11 కేవీ సబ్‌స్టేషన్(KV Substation)కు పీఎం కుసుమ్–A పథకం కింద ఏర్పాటు చేసిన మొత్తం 2 మెగావాట్ల(Megawatts) సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్ ప్లాంట్‌ను మంగళవారం గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం చేసి టెక్నికల్‌గా ఛార్జ్ చేశారు. బోధన్ టౌన్–2 సెక్షన్ పరిధిలోని టాక్లీ గ్రామంలో 1 మెగావాట్ చొప్పున రెండు యూనిట్లుగా ఏర్పాటు చేసిన ఈ సౌర విద్యుత్ ప్లాంట్‌ను సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ పి.వి. రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఈ పి.వి. రాజేశ్వర్ రావు మాట్లాడుతూ.. సౌర విద్యుత్‌ను స్థానిక విద్యుత్ వ్యవస్థలోకి అనుసంధానం చేయడం వల్ల పునరుత్పాదక ఇంధన వినియోగం పెరుగుతుందని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తి ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించడం, సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు, భవిష్యత్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈ (ఎంఆర్‌టీ, టెక్నికల్) వెంకటరమణ, బోధన్ డీఈ మొహమ్మద్ ముక్తార్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కె. నగేష్ కుమార్, ఏఈ (హెచ్‌టీ మీటర్స్) బాలచందర్, బోధన్ టౌన్–2 సెక్షన్ ఏఈ కళ్యాణ్, బోధన్ టౌన్–1 ఏఈ నాయిని కృష్ణ, సౌర విద్యుత్ ప్లాంట్ రైతులు ఉప్పలపాటి సుబ్బారావు, డాక్టర్ ఉప్పలపాటి శ్రీకాంత్, హున్సా సర్పంచ్ శివకుమార్, ప్రజాప్రతినిధులు, గ్రామ వినియోగదారులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.