విద్యుత్ పొదుపుతో ఆర్థిక మదుపు

22-09-2026 | 03:26pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): విద్యుత్‌(Electricity)ను పొదుపుగా వినియోగించడం ద్వారా బిల్లులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని సూపరింటెండింగ్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే తెలిపారు. అవసరం లేని లైట్లు(Lights), ఫ్యాన్లు(Fans) ఆఫ్ చేయడం, ఏసీని అవసరమైనప్పుడే వినియోగించడం, అధిక విద్యుత్ వినియోగ పరికరాలను పరిమితంగా ఉపయోగించాలని సూచించారు. కొత్త పరికరాలు కొనుగోలు చేసేటప్పుడు బీఈఈ స్టార్ రేటింగ్‌ను పరిశీలించాలన్నారు. రోజుకు రెండు యూనిట్ల విద్యుత్ పొదుపు చేస్తే ఏడాదికి సుమారు 730 యూనిట్లు ఆదా చేయవచ్చన్నారు. విద్యుత్ పొదుపును ప్రతి ఒక్కరూ రోజువారీ అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు