అయ్యప్ప పడి పూజలో పాల్గొన్న డాక్టర్ మట్టా
28-11-2026 | 12:15pm
సత్తుపల్లి, నవంబర్ 28 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు దొడ్డ శ్రీనివాసరావు కుమారుడు, కన్యాస్వామి దొడ్డ ప్రవీణ్ నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ (Ayyappa Padi Pooja) మహోత్సవంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు (Special Prayers) నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులతో కలిసి కొంతసేపు ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అయ్యప్ప స్వాములు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.