నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ మట్టా

28-11-2026 | 11:57am

సత్తుపల్లి–వేంసూరు, నవంబర్ 28 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాయుడుపాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ మెడ వెంకటేశ్వరరావు సోదరుడు మెడ రామారావు, ప్రమీల దంపతుల కుమారుడు జయంత్, రోహిణిల వివాహ రిసెప్షన్ (Wedding Reception) వేడుక ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా (Chief Guest) హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు జయంత్, రోహిణిలను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం (Married Life) సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో నిండి కలకాలం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వేంసూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల చంద్రశేఖర్ రెడ్డి, మండల, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు