తక్కెళ్ళపాడులో వైద్య శిబిరం..

13-10-2026 | 08:15pm

ఎర్రుపాలెం అక్టోబర్ 13 (విజయక్రాంతి): బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తక్కెళ్లపాడు గ్రామంలో వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్(Dr. Prashanth) ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, బి.పి, షుగర్ వంటి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 76 మందికి పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది. దీనితో పాటు వైద్యాధికారి ప్రజలకు వ్యాధుల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, మరియు అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముక్కర రామకృష్ణారెడ్డి, పి.సి.సి సభ్యులు శీలం ప్రతాప్ రెడ్డి, హెచ్ ఈ ఓ భాస్కరరావు, సూపర్ వైజర్ లంకా కొండయ్య, హెల్త్ అసిస్టెంట్ గోపాలరావు, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు, ఆశా కార్యకర్తలు మాణిక్యం, రాణి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు