కష్టకాలంలో చేయూత.. అవసర సమయంలో అండ
కూసుమంచి,(విజయక్రాంతి): ప్రజల కష్టాల్లో అండగా నిలవడం, పేద కుటుంబాలకు వైద్య చికిత్స కోసం ఆర్థిక భరోసా కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు నిదర్శనం. కూసుమంచి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అనారోగ్య కారణాలతో వైద్య చికిత్స చేయించుకుని, ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరు అయినా ముఖ్యమంత్రి సహాయనిధి (Chief Minister Relief Fund) సంబంధించిన చెక్కులను నేడు కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల కష్టాల్లో అండగా నిలవడం, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతులు, నిరుపేద కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కలెక్టర్ దివాకర, ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య,RDO జి నరసింహారావు , కూసుమంచి MRO సైదులు, కూసుమంచి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.