సర్వే నంబర్ 40లో 12ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

28-11-2026 | 11:55am

సత్తుపల్లి, నవంబర్ 28 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామం, బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 40లో మిగిలిన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని శనివారం సర్వే చేసి స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఫెన్సింగ్ రాళ్లు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమి (Government Land) పరిరక్షణకు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. మిగిలిన 12 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారుల ద్వారా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టారు.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడటం, ప్రజా ఆస్తులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. భూ పరిరక్షణ (Land Protection) కోసం అవసరమైన చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల (Public Assets) రక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, జాతీయ బీసీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నారాయణపురపు శ్రీనివాస్, గంగారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కావేటి అప్పారావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు