పుట్టిన ఊరికి అభివృద్ధికి నిధులు..

23-11-2026 | 08:55pm

ప్రభుత్వ పాఠశాలను దత్తతకు తీసుకున్న దాత షేక్ హుస్సేన్ సాహెబ్..

ఎర్రుపాలెం నవంబర్ 23 (విజయక్రాంతి): తాను పుట్టి పెరిగి చదువుకున్న గ్రామానికి వెలుగులు నింపాలని ఆ గ్రామంలో ఉన్న పాఠశాలను దత్తతకు తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని రేమిడిచర్ల(Remidicherla) గ్రామంలో పేద కుటుంబంలో పుట్టిన హుస్సేన్ ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు రేమిడిచర్ల జెడ్పిహెచ్ఎస్ లో చదువుకొని, ఖమ్మంలో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. వి ద్యారంగ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే సదుద్దేశంతో తన సొంత గ్రామంలోఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.

పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు సుమారు రూ. 200000 లక్షలు విలువైన అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఇందులో భాగం గా  పాఠశాలకు అవసరమైన పదవ తరగతి విద్యార్థులకు అల్పాహారం కింద 5000 రూపాయలను, మొక్కల పెంపకంలో భాగంగా ఎర్రమట్టి తోలుకానికి 40 వేల రూపాయలను. ప్రైవేట్ విద్యార్థుల తో పోటీ గా ఉండే విధంగా గ్రామంలో గల అన్ని స్కూల్ పిల్లలకు టీ షర్ట్లు పంపిణీ కి 25000, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు సుమారుగా 60000 రూపాయలు ఖర్చుతో వాటర్ ప్లాంట్ ను, పిల్లలకు ఆటల్లో ఎటువంటి దెబ్బలు తగలకుండా ఇసుకను 40 వేల రూపాయల ఖర్చుతో తోలించటం వంటి సౌకర్యాలను కల్పించనున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు , మరియు గ్రామ ప్రజలు దాతను  శాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమని, షేక్ హుస్సేన్ సాహెబ్, తో పాటుగా గ్రామ సర్పంచ్ కాపు వరప్రసాదరావు ,పాఠశాల పరిస్థితులను దాతకు చెప్పినందుకు గాను పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్ కాపు వరప్రసాద్, ఉప సర్పంచ్ నాగిరెడ్డి సాంబశివరావు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు సామినేని చెన్నకేశవరావు సామినేని రామారావు, యనమందల శివన్నారాయణ, కుక్కలు మురళీకృష్ణ మెండగుదుల వెంకయ్య, మెండగుదుల శ్రీనివాసరావు, కుక్కల కోటేశ్వరావు , మాదల కృష్ణారావు , తూబాటి బాలకృష్ణ , సామినేని మురళి , రామిశెట్టి వెంకటేష్, పులి ఉమా, పుచ్చకాయల విజయ్ , గరికపాటి రవి ,బెజ్జం నాగ మల్లేశ్వరరావు  బొల్లిపల్లి దుర్గారావు  వార్డ్ నెంబర్లు గరికపాటి గరికపాటి రత్న కాంతు , గరికపాటి సామెల్ , ఎలకపాటి ప్రసన్నకుమార్  బుడుగల్లు ప్రకాశరావు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ టీచర్లు ఐకెపి నెంబర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు