అసలు దోషులను విడిచి పెట్టి చిరుద్యోగులపై ప్రతాపమా?
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లి: అసలు దోషులను విడిచిపెట్టి చిరుద్యోగులపై ప్రతాపం చూపడం సరికాదని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య(Former MLA Durgam Chinnaiah ) మండిపడ్డారు. సోమవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు పరిచకుండా తెలంగాణ రాష్ట్రన్ని సాధించిన ఉద్యమ నేత కే సీ ఆర్ ను ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం, అమానుషమన్నారు.
బెల్లంపల్లి మండలంలో నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణంలో పోలీసు అధికారులు అసలు దోషలను వదిలేసి కింది స్థాయి అధికారులను ఈ కేసులో బలిచేసి జైలుకు పంపడం దారుణమన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లు ఈ కేసులో అధికారులను కాపాడు కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ల కుంభకోణంలో అధికార పార్టీ నాయకుల హస్తం ఉందన్నారు. లోతుగా విచారిస్తే అసలు నిజాలు బయట పడతాయని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట సభలో మాజీ సీఎం కేటీ కేసీఆర్ పై పిచ్చి, వెర్రి కూతలు కూయడం సిగ్గు చే టన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున అనధికార సర్టిఫికెట్ల కుంభకోణంపై అధికారులు లోతుగా విచారించకుండా నామమాత్రంగా విచారించారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ తుంగల సత్యనారాయణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మున్సిపల్ కౌన్సిలర్లు తిరుమల వాసు, దొంగల రాజ్ కుమార్, గోగర్ల స్వప్న, రజిత,సర్పంచ్ సింగతి రాజేష్,పట్టణ పార్టీ అధ్యక్షుడు నూనేటి సత్యనారాయణ,అధికార ప్రతినిధి, కొమ్మర లక్ష్మణ్, బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు బొప్ప అర్జయ్య,ఎరుకల సుందర్ రావు,రెవెల్లి విజయ్, వేముల కృష్ణమూర్తి, తొంగల రాజేశం, మాసాడి శ్రీరాములు, అశోక్ గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.