ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేద కుటుంబాలకు భరోసా
23-11-2026 | 08:51pm
వెల్దుర్తి, నవంబర్ 23, (విజయక్రాంతి): వెల్దుర్తి మండలం మెల్లూరు(Melluru) గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ రంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులని, అర్హులైన వారందరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ నవీన్ రెడ్డి, నాయకులు నిరంజన్ రెడ్డి బాబు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.