కపాస్ కిసాన్ పథకం కింద పత్తి రైతులకు శిక్షణ

13-10-2026 | 07:39pm

కూసుమంచి, అక్టోబర్ 13(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని మునిగేపల్లి, కిష్టాపురం గ్రామాలలో రైతులకు పత్తి పంటలో చీడపీడలు, తెగుళ్ల నివారణపై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం వ్యవసాయ క్షేత్రంలో(Agricultural field) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం వైరా శాస్త్రవేత్తలు డాక్టర్ పావని (Dr. Pavani, a scientist at the Central Vaira),డాక్టర్ ఫణిశ్రీ పాల్గొని రైతులకు పత్తి పంటలో వివిధ అంశాలపై అవగాహన కల్పించారు .

ఈ సందర్భంగా వారు  పత్తి పంటలో ప్రధానంగా వచ్చే చీడపీడలు మరియు తెగుళ్లను గుర్తించడం, వాటి నివారణ, సమగ్ర సస్యరక్షణ చర్యలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి పంటలో చీడపీడలు, తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి, శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.

అవసరానికి అనుగుణంగా సిఫారసు చేసిన మందులను మాత్రమే వినియోగించాలని, పంటలో పురుగు మందుల వాడకంలో తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రస్తుతం గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించాలని తెలిపారు. అనంతరం పత్తి పంటను సందర్శించి, 

రైతులకు ప్రతి పంటలో వినియోగించే   మొక్క పెరుగుదల నియంత్రకాలు సబ్సిడీలో అందజేశారు. ఈ కార్యక్రమంలో  కేవీకే శాస్త్రవేత్త శ్రీమతి పావని , శ్రీమతి ఫణి శ్రీ,  కిష్టాపురం గ్రామ సర్పంచ్ సైదులు గారు, మండల వ్యవసాయ అధికారి శ్రీమతి రామడుగు వాణి , ఏఈఓ రవీందర్ ,జానీ బాబా మరియు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు