వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేస్తాం
ఆసిఫాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి):జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి(District Government Hospital) (GGH)లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు PF విషయంలో అన్యాయం జరుగుతోందని AITUC డిప్యూటీ ప్రధాన కార్యదర్శి A. చిరంజీవి ఆరోపించారు. కార్మికులకు రూ.11 వేల వేతనం చెల్లిస్తూ, PF మాత్రం రూ.7,500పై మాత్రమే జమ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యపై AO తిరుపతి, ఏజెన్సీ సంపత్‌కు వినతిపత్రం అందజేశారు.పూర్తి వేతనంపై PF జమ చేయాలని, గత బకాయిలను వడ్డీతో చెల్లించాలని, GO 60 ప్రకారం పూర్తి వేతనాలు ఇవ్వాలని, ప్రతి నెల పే స్లిప్, PF స్లిప్ అందించాలని డిమాండ్ చేశారు.
వారం రోజుల్లో సమస్య పరిష్కరించకపోతే DME, EPFO కార్యాలయాల ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు భోగే ఉపేందర్, బ్రాంచ్ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్, ఉపాధ్యక్షులు నరేందర్, నాయకులు యస్వంత్, సాయి కిరణ్, రాజ్‌కుమార్, కృష్ణ, వంశీ తదితరులు పాల్గొన్నారు.