దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

21-09-2026 | 06:14pm

జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై వచ్చే దరఖాస్తులను తత్వమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్(Additional Collector Yuvraj Marmat) అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని రెబ్బెన మండలం గోలేటికి చెందిన లావుడ్య మమత తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన కొడప అనుతారావు తనకు దివ్యంగ పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. సిర్పూర్ టి మండలం పారిగాం గ్రామానికి చెందిన డుర్కే విశ్వనాథ్ తనకు గతంలో పింఛను వచ్చి ఆగిపోయిందని తిరిగి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. జిల్లా కేంద్రానికి చెందిన కాంబ్లే కీర్తికుమార్ తనకు ప్రభుత్వ వైద్య కళాశాలలో పొరుగు సేవలు కింద ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

సిర్పూర్ పి మండల కేంద్రానికి చెందిన గద్దల రమేష్ తనకు విశ్వకర్మ పథకం కింద రుణ సదుపాయం కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. చింతల మానేపల్లి మండలం బాబాసాగర్ గ్రామానికి చెందిన పిప్పిరే బాబాజీ తన వాటా భూమిని ఇతరులు ఆక్రమించినందున తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రత్నం పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు అర్జీదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు