బెజ్జూర్ లో ఘనంగా గాంధీ జయంతి
బెజ్జూర్ అక్టోబర్ 2 (విజయ క్రాంతి): బెజ్జుర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం(Arya Vysya Sangham) ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి ని ఘనం గా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ వాసవి సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సామల కిరణ్ కుమార్, శ్రీ రంగనాయక స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు తంగడిపల్లి మహేష్, మండల ఆర్య వైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు రాచకొండ చంద్రశేఖర్ మండల మాజీ అధ్యక్షులు రాచకొండ శ్రీవర్ధన్, సంఘం నాయకులు పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి ఘనంగా గాంధీ జయంతి నిర్వహించారు అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కొండ్ర జగ్గ గౌడ్, నేరెళ్ల సత్యనారాయణ, భోగ గోపాల్, మిరియాల పెంటన్న, మిరియాల వెంకటరమణ, భోగ ప్రశాంత్, నేరెల్లి సంతోష్, లింగం పద్మాకర్, ఓజ్జల రాజన్న, బోగా శంకరయ్య, మిరియాల కృష్ణ, తంగడి పెళ్లి నీలేష్, ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యురాళ్ళు, పుల్లూరి అంజలి దేవి, నేరెల్లి కళావతి, భోగ సంగీత, తంగేడు పెళ్లి పావని, మధ్యర్ల కళావతి, శ్యామల సౌమ్య, తదితరులు పాల్గొన్నారు.