నైతం రాజు ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలు నిర్మించాలి

29-10-2026 | 06:28pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): సాగులో ఉన్న భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని, ఆదివాసీలపై అటవీ దాడులు ఆపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM State Secretary John Wesley) డిమాండ్ చేశారు. గురువారం ఆసిఫాబాద్‌లోని రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం(Telangana Adivasi Tribal Association) జిల్లా ఉపాధ్యక్షుడు నైతం రాజు సంస్మరణ సభ నిర్వహించారు.

ఐదో షెడ్యూల్ పరిరక్షణ, ఆదివాసీ హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలు నిర్మించడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న అధ్యక్షత వహించగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అబ్బాస్, ఎం.వి.రమణ, ఆశయ్య, నగేష్, పూసం సచిన్, కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, జె.రాజేందర్, గోడిసెల కార్తీక్, గేడెం టికానంద్, దుర్గం నిఖిల్, ముంజం ఆనంద్ కుమార్, లంకా రాఘవులు, బండి దత్తాత్రి, డి.మల్లేష్, బోడెంకి చందు, ఏర్మ పున్నం, తొడసం శంభు, దూల లక్ష్మి, శ్యాగం కమల, దిగిడ బక్కన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు