తెలంగాణకు కేంద్రం రూ. 50 వేల కోట్లు ప్రకటించాలి

29-10-2026 | 07:05pm
  1. సీ పీ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ 
  2. తాండూరు మండలన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి

బెల్లంపల్లి: కరవు పరిస్థితుల నుంచి రైతులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.50 వేల కోట్లు  కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM State Secretary John Wesley) డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం లో ఎల్ నీ నో ప్రభావం వల్ల నష్టపోయిన పత్తి పంటలను జాన్ వెస్లీ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర బృందం పరిశీలించింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఎల్ నీ నో ప్రభావంతో కరువు తాండవిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనీ విమర్శించారు. చిత్తశుద్ధి  ఉంటే కేంద్ర ప్రభుత్వం రూ.50వేల కోట్ల నిధులు తెలంగాణకు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలంలో నిర్థిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.. మంచిర్యాల జిల్లాలో 11 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ, అందులో తాండూర్ మండలన్ని విస్మరించారని తెలిపారు.

ఇప్పటికైనా తాండూరు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలనీ కోరారు.  నష్టపోయిన వాణిజ్య పంటలకు రూ.50, వేలు, ఆహార పంటలకు రూ.30 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్నారు. .రువు నేపథ్యంలో నిత్యావసర సరకుల రేట్లు భారీగా పెరిగాయనీ వాపోయారు. బియ్యం 90రూపాయలకు కేజీ అయ్యిందనీ, పేదలు, మద్యతరగతి ప్రజలు ఎలా బతకాలనీ ప్రశ్నించారు.

ఈ  విషయంలో ప్రభుత్వాలు బాధ్యత వహించాల కోరారు. నిత్యావసరాల ధరలు తగ్గించాలినీ, సబ్సిడీలో 14 రకాల సరుకులు రేషన్ ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎల్ నినో ప్రభావం వల్ల వ్యవసాయ కూలీలకు  పని దొరకపోవడం లేదునీ ఆందోళన వ్యక్తం చేశారు.. ఉపాధి హామీ సంవత్సరానికి 200 రోజులు కల్పించి రోజుకి రూ. 800  ఇవ్వాలనీ పునరుద్ఘాటించారు.

వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ భరోసా పథకం ఇవ్వాలన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేయాలనీ కోరారు.. కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్షం కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ప్రజలందరిని ఆదుకోవాలని తెలిపారు.. కేంద్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలకు ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలి,

లేని పక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీ పీ ఎం రాష్ట్ర, కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, భూపాల్, ఎంవీ రమణ, ఆశన్న, సిపిఎం  రాష్ట్ర కమిటీ సభ్యులు, నగేష్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా కార్యదర్శి బోడంకి చందు, జిల్లా కార్యదర్శి, గోమాస ప్రకాష్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు,

గుమాస అశోక్ ,దాగం రాజారాం సీపీఎం పార్టీ తాండూరు మండల కార్యదర్శి, సాంబార్ వెంకటస్వామి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, శ్రీకాంత్, పాయిరాల రాములు , దుర్గం నాన్నయ్య, బొల్లం రాజేశం, కొమ్మ రాజయ్య, రైతులు, కౌలుదారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు