దమ్మపేట గురుకుల కళాశాలకు 7 కంప్యూటర్ల అందజేసిన ఎమ్మెల్యే

29-10-2026 | 06:30pm

దమ్మపేట, అక్టోబర్ 29(విజయ క్రాంతి): మండల కేంద్రంలోని గిరిజన గురుకుల కళాశాల(Tribal Residential College) విద్యార్థుల ఆన్‌లైన్ శిక్షణ సౌకర్యాల కోసం ఇన్ఫోసిస్ కంపెనీ తరఫున భద్రాచలం ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తోడ్పాటుతో అశ్వారావుపేట నియోజకవర్గ ఎం ఎల్ ఏ జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana) 7 కంప్యూటర్లను కళాశాలకు అందించారు.

విద్యార్థులు ఈ కంప్యూటర్లను వినియోగించుకుని ఆన్‌లైన్ శిక్షణ తరగతుల ద్వారా జేఈఈలో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి. సీతారామ్, తహసీల్దార్ (యు/టి డిప్యూటీ కలెక్టర్) మద్దినేని మురళి, ఎం ఈ ఓ జగపతి, కాంగ్రెస్ నాయకులు పర్వతనేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు