పోలీసులకు డీఐజీ సూచనలు

18-10-2026 | 10:52am

ఆసిఫాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందిస్తూ, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని కాళేశ్వరం జోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం సాయంత్రం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, సీసీటీఎన్‌ఎస్ (CCTNS) పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.

జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, ఆకస్మిక వాహన తనిఖీలు (Vehicle Checks) నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు

మరిన్ని వార్తలు