సన్నబియ్యం ఇవ్వండి!
- డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రికవరీకి కొత్త అస్త్రం
- బకాయిల కింద సన్న బియ్యం, నగదు చెల్లింపులకు ఛాన్స్
- 45 రోజుల్లో 125 శాతం ఇవ్వాల్సిందే
- 3.44లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు సన్నాహాలు
- ‘విజయక్రాంతి’ కథనంతో సర్కార్లో కదలిక
- ఎల్ నినో వేళ బియ్యం నిల్వల పెంపునకు చర్యలు
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాం తి): ‘ఎల్ నినో’(El Niño) పరిస్థితులను ముందు గానే అంచనా వేయడంలో వెనుకబడ్డ రాష్ట్ర ప్ర భుత్వం.. ‘విజయక్రాంతి’ కథనంతో అప్రమత్తమైంది. సన్న బియ్యం సేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)(Custom-milled rice) డిఫాల్టర్ల రికవరీ విధానంలో మా ర్పులు చేయడంతో పాటు, స్టేట్ఫూల్ కింద 3.44 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం సేకరించాలని పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీచేసింది.
ఎల్ నినో వేళ.. రాష్ట్రం లో సన్నబియ్యం నిల్వలకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. ‘సన్నాలకు సెగ!’ శీర్షికతో ఈనెల 10న విజయక్రాంతి దినపత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. ‘కరువు కాలంలో మేల్కొనకపోతే సర్కారుకు తిప్పలే’ అని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సన్నబియ్యా న్ని సేకరణకు ఉపక్రమించింది.
పదేళ్లుగా ఉన్న డిఫాల్టర్లకు అవకాశం
రాష్ట్రంలో వందల మంది మిల్లర్లు డిఫాల్టర్లుగా ఉన్నారు. ప్రభుత్వం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకుని, వ్యాపారం చేసుకున్నారు. 2014 వానాకాలం నుంచి 2024 యాసంగి వరకు పెద్ద సంఖ్యలో డిఫాల్టర్లు ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. వీరి నుంచి దాదాపు లక్ష ల క్వింటాళ్ల ధాన్యం లెక్కతేలాల్సి ఉంది. ఈ మొత్తాన్ని 25 శాతం జరిమానా, 12 శాతం వడ్డీతో వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఎల్ నినో నేపథ్యంలో ప్రమాదాన్ని గ్రహించిన ప్రభుత్వం.. సన్నబియ్యం సేకరణపై ఆలస్యంగానైనా మే ల్కొం ది. డిఫాల్టర్లు సన్నబియ్యం రూపంలోనూ బకాయిలు చెల్లించేందుకు వెసులు బాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగదు లేదా సన్నబియ్యం రూపంలోనూ చెల్లించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. సన్నబియ్యం అయితే 125 శాతం చెల్లిం చాల్సిందేనని స్పష్టం చేసింది. ఇందులోనే 12 శాతం వడ్డీని కూడా చేర్చింది.
అయితే కొద్ది రోజుల క్రితం క్యాబినెట్ సబ్ కమిటీతో జరిగిన సమావేశంలో వడ్డీని పూర్తిగా ఉపసంహరించాలని రైస్ మిల్లర్ల ప్రతినిధులు కోరగా.. పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రతినిధులు తెలిపారు. అయితే మిల్లర్లు చెల్లించాల్సిన 125 శాతం సన్నబియ్యం/విలువలో ఇది కూడా చేర్చా రు. బకాయిల ను సన్న బియ్యం లేదా నగ దు రూపంలో 45 రోజుల్లోగా చెల్లించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.ఈ మేరకు జిల్లా ల కలెక్టర్లు, డీసీఎస్వోలు, డీఎంలు, సీఎస్సీలకు కూడా మార్గదర్శకాలు చేసింది.
3.44లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం
2025 వానాకాలం సీజన్కు సం బంధించి మిల్లర్లకు కేటాయించిన 5.14 లక్ష ల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ నుంచి 3.44 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని స్టేట్ఫూల్ కింద సేకరించేందుకు సివిల్ సప్లు శాఖ శనివారం (ఈనెల 17న) ఉత్తర్వులు జారీచేసింది. 30 జిల్లాల్లో 39.08 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని కేటాయించారు. ఇందులో 16 జిల్లాల్లో స్టేట్ఫూల్ కింద సివిల్ సప్లు శాఖ కు సన్నబియ్యం కోసం కేటాయించిన 5.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది.
ఇందులో నుంచి 3.44 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లు శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం జారీ చేసిన రెండు రకాల ఉత్తర్వులతో ప్రభుత్వానికి కొంతమేరకైనా సన్నబియ్యం వచ్చే అవకాశం ఉంది. రాబోయే కాలంలో ఈ ని ల్వలను వాడుకునే అవకాశం ఉండనుంది. అటు డిఫాల్టర్లు, ఇటు 2025 వానాకాలం సీజన్కు సంబంధించి సేకరించనున్న సన్నబియ్యంతో కొరత తీరనుంది.