తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనం
- గోదావరి కావేరి లింక్‌తో పెద్ద కుట్ర
- రేవంత్‌రెడ్డి మద్దతు చారిత్రక ద్రోహం
- కుక్కిన పేనుల్లా ఉన్న తెలంగాణ ద్రోహులంతా నిద్రలేచారు
- మనోడి ‘చెయ్యే’ మన నోట్లో మట్టికొడుతున్నది
- రేవంత్‌రెడ్డి వదిలిపెడితే చంద్రబాబు ఒడిసిపట్టిండు
- తెలంగాణ జాతికి మోసం చేస్తే ఎలాంటి పోరాటినికైనా సిద్ధమే
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాం తి) : గోదావరి నదుల లింకు(Linking of the Godavari rivers) పేరు తో తెలంగాణ నీటి హక్కులకు మరణశాస నం రాస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు(Former Minister Harish Rao) ఆరోపించారు. నవంబర్ 3న ఢిల్లీలో ఎన్‌డబ్ల్యూడీఏ మీటింగ్ జరగబోతున్నదని, గోదా వరి లింకును ఈ ఎజెండాలో చేర్చు తూ అన్ని రాష్ట్రాలకు పంపారని, అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కుట్రకు మద్దతు పలుకుతూ చారిత్రక ద్రోహానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.
గోదావరి లింకును పోలవరం నుంచి చేపట్టాలని చంద్రబాబు లేఖ రాయగానే ఎజెండాలో చేర్చి మీటింగ్ పెడుతున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంతకాలం కుక్కిన పేను ల్లా పడి ఉన్న తెలంగాణ ద్రోహులంతా మళ్లీ నిద్రలేచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం లింకు ప్రాజెక్టుతో గోదావ రి జలాలను అక్రమంగా ఆంధ్రకు తరలించేందుకు విషకూటమిలా తయారయ్యారని మండిపడ్డారు.
తెలంగాణలో రేవంత్ సర్కా ర్ ఏర్పడిన మరుక్షణం నుంచే, ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జలాల దోపిడీ మొ దలు పెట్టారని, కోవర్టు రేవంత్ మన నీటి హక్కులను నిండా ముంచుతున్నారని విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఎప్పటికప్పు డు ఎత్తులు వేస్తూనే ఉన్నారని, మన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంటే, ఆ ఎత్తుల ను బీఆర్ఎస్ చిత్తు చేస్తూ వస్తున్నదని పేర్కొన్నారు.
చంద్రబాబు ఇప్పుడు గోదావరిె కావేరి ముసుగులో మూడో ప్రతిపాదన తీ సుకువచ్చారని, నేరుగా పోలవరం నుంచి బొల్లపల్లి, నాగార్జున సాగర్ ద్వారా కావేరికి నీళ్లు తరలించే ప్లాన్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ హెచ్చరించినట్టు.. ‘కత్తి పరాయి వాడిదే కానీ, పొడిచే చెయ్యి’ మనోడిదేనని, ఆ ‘చెయ్యి’ తెలంగాణ నోట్లో మట్టికొడుతున్నదని, మన ఎవుసం కూలగొట్టి, పరాయి పల్లకీ మోస్తున్నదని, మన నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెడుతున్నదని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి గురుదక్షిణగా అనుకుంటున్నారని, కానీ ఇది అంతకుమించిన జాతి ద్రోహమని, సీఎం చేస్తున్న జల ద్రోహానికి భవిష్యత్ తరాలు కూడా ఆయన్ను క్షమించవని హెచ్చరించా రు. ఇన్నాళ్లూ మనకు నీళ్లున్నా.. నీటి హక్కులున్నా రేవంత్‌రెడ్డి వినియోగించలేదని, ఇ ప్పుడు ఏకంగా నీటి హక్కులే లేకుండా చం ద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని 9 నెలల నుంచి మొత్తుకున్నా పట్టించుకున్న పాపాన పోలేద ని, ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైన రేవంత్ రెడ్డి నేడు ఎల్ నినో పేరు చె ప్పి చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి వదిలిండు.. చంద్రబాబు ఒడిసి పట్టిండు..
నీళ్లను కొనలేమంటూనే నీళ్ల విషయం లో నిర్లక్ష్యం చేశారని హరీశ్‌రావు విమర్శించారు. దేవాదులలో పదికి పది మోటార్లు నడిపితే వరంగల్‌లో కరువు వచ్చేది కాదన్నా రు. రేవంత్‌రెడ్డి వదిలిపెడితే చంద్రబాబు ఒడిసిపట్టిండు, ఏపీలో కరువు లేదని తెలిపా రు. తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం నమోదైనా ఏపీలో క్రాప్ హాలిడే లేదు, ఇక్క డ మాత్రం పంటలు వేయొద్దంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో జలహారతి, తెలంగాణలో కన్నీళ్ల హారతి అని, పాలమూరుకు, తెలంగాణకు కాలం తెచ్చిన కరువు కాదు, రేవంత్ తెచ్చిన కరువు అని మండిపడ్డారు. కన్నెపల్లిలో కట్క ఒత్తితే నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా, బారాణ తెలంగాణకు, హైదరాబాద్‌కు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా రాజకీయాలు చేస్తూ లేని కరువు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపుల వద్దకు అఖిలపక్షం తీసుకుపోతే మీ ఫెయిల్యూర్ చూపిస్తామని సవాల్ చేశారు.
గోదావరి జలాలను తరలించుకుపోయే లింకు విషయంలో చంద్రబాబు లేఖల మీద లేఖలు రాస్తుంటే.. రేవంత్‌రెడ్డి రాతి బొమ్మ లెక్క, మ న్ను తిన్న పాము లెక్క కదలడు మెదలడని ఎద్దేవా చేశారు. ఇచ్చంపల్లి లేదా సమ్మక్కసాగర్ నుంచి అనుసంధాన ప్రాజెక్టుకు నీళ్లు మళ్లించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ఈనెల 7న పాటిల్‌కు లేఖ రాశారని, ఇది నదుల అనుసంధానం పేరిట మన రాష్ట్రానికి జరుగుతున్న దుర్మార్గానికి అధికారిక దస్త్రమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చం ద్రబాబు ప్రతిపాదించినట్టు గోదావరి నీటిని నాగార్జున సాగర్ రిజర్వాయర్‌లోకి కాకుం డా బొల్లపల్లి రిజర్వాయర్‌కు మళ్లిస్తే తెలంగాణ హక్కులు ఏం కావాలని ప్రశ్నించారు. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ మీదుగా పోతే 2,38,236 ఎకరాలకు నీళ్లు అందుతాయని, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్లగొం డ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీళ్లు వస్తయని, ఇది ఆనాటి కేంద్రం ఎంఓయూలోనే స్పష్టంగా ఉందని గుర్తు చేశారు.
చంద్రబాబు లేఖ రాసి పది రోజులు అవుతున్నా మీకు సోయి రాదు, పెదవి విప్పరని మండిపడ్డారు. అసలు ఇంటర్ లింకింగ్ నుంచి సమ్మక్క సాగర్ ను ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు. కింద గోదావరి నీళ్లు మేం వాడుకుంటాం.. పైన ఆల్మట్టిలో 16 టీ ఎంసీలు ఆపుకుని పోలవరం లింకుకు కర్ణాటకను ఒప్పించేందుకు ఏపీకి వచ్చిన తమిళ నా డు సీఎం విజయ్‌కి చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని వెల్లడించారు.
ఇప్పటికే పోలవరం డైవర్షన్‌లో 21 టీఎంసీలు, ఇప్పుడు 16 టీ ఎంసీలు అంటే 37 టీఎంసీలు కృష్ణాలో ఆగి తే పాలమూరు జిల్లాకు నష్టమని, అయినా రేవంత్‌రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేద ని ప్రశ్నించారు. ఎవరూ శాశ్వతం కాదని, తె లంగాణ మాత్రమే శాశ్వతమని, రాష్ట్ర హక్కులను కాలరాసే హక్కు నీకు లేదు రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
16 మంది ఎంపీలు గడ్డి పీకుతున్నారా..
ఇచ్చంపల్లి నుంచి లింకు ప్రాజెక్టు వెళ్తే అ న్ని రాష్ట్రాలకు ఉపయోగమని, కానీ కేంద్రం చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 16 మంది ఎంపీ లు ఉండి గడ్డి పీకుతున్నారా అని నిలదీశా రు. ఈ ప్రతిపాదన కేంద్రం ఒప్పుకుంటే తె లంగాణ జాతికి శ్వాశ్వతంగా ద్రోహం చేసినట్లే అని స్పష్టం చేశారు. రేవంత్ గురు దక్షి ణ చెల్లిస్తుంటే, బీజేపీ ఎందుకు స్పందించ డం లేదు?, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ హక్కులను కాపాడే బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.
ఏపీ ప్రయోజనాలే దేశ ప్రయోజనాలు అవుతాయా?, చంద్రబా బు ఎంపీలను చేతిలో పెట్టుకొని ఆడిస్తే కేం ద్రం ఆడుతుందా? అని మండిపడ్డారు. తె లంగాణ జాతిని మోసం చేస్తామంటే రాష్ట్ర ప్రజలు ఊరుకోరని, ఎలాంటి పోరాటినికైనా సిద్దమని హెచ్చిరించారు. ఈ ప్రతిపా దనలు వెంటనే ఉపసంహరించుకోవాలి డి మాండ్ చేశారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని, బా ధ్యత లేని వాడు సీఎం అయితే ఎట్లుంటదో తెలంగాణ బెస్ట్ ఉదాహరణ అని ఎద్దేవా చేశారు.
మాకు ఏపీ, తమిళనాడు మీద ద్వే శం లేదు.. కానీ మాకు నష్టం జరిగితే చూ స్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అస లు సర్ ప్లస్ వాటర్ ఎంతుంది, తెలంగాణ వాటా ఎంత అది తేలకుండా వాడుకుంటామని ఏపీ అంటే తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సర్ ప్లస్ వాటర్ మీద ప్రాజెక్టు అనుమతించరని స్పష్టం చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్ళతో పెకలిస్తాం, బీజేపీకి బుద్ధి చెబుతాం అని హెచ్చరించారు.