జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ..ఎస్ఐ శ్రీకాంత్ సస్పెండ్
18-10-2026 | 11:01am
గంభీరావుపేట, అక్టోబర్ 17 (విజయక్రాంతి): గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన పి. శ్రీకాంత్ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ, జోన్-3 రాజన్న ఇన్చార్జి డీఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు, జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ (Third-Degree Torture) ప్రయోగించారన్న ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్ (Suspension) విధించినట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.సస్పెన్షన్ కాలంలో ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా హెడ్క్వార్టర్స్ (Headquarters) విడిచి వెళ్లకూడదని ఉత్తర్వుల్లో ఆదేశించారు.