దసరా రమ్మంటుంది..పట్నం కదిలింది

18-10-2026 | 08:10am

దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా సమీపంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

పండుగ సెలవుల కోసం నగరవాసులు పల్లెబాట పట్టడంతో హైవేపై వాహనాల రాకపోకలు పెరిగాయి. దీనికి తోడు జాతీయ రహదారిపై కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ట్రాఫిక్ సమస్యను మరింత పెంచాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. టోల్ ప్లాజా వద్ద వాహనదారులు కొంతసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో హైవేపై రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రయాణికులు ముందస్తు ప్రణాళికతో బయలుదేరాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు