కొమురం భీం విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ఆహ్వానం
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల(Indravelli Mandal) కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించనున్న అమరవీరుడు కొమురం భీం విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరుకావాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Laxmi)ని నిర్వాహకులు ఆహ్వానించారు. ఆదివాసుల హక్కులు, ఆత్మగౌరవం కోసం జల్–జంగల్–జమీన్ నినాదం(Jal-Jangal-Zameen Slogan)తో పోరాడిన కొమురం భీం ఆశయాలను భవిష్యత్ తరాలకు చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మహోత్సవానికి ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజ్ గొండ్ సేవా సమితి జాతీయ అధ్యక్షుడు సిడం అర్జు, తుడుం దెబ్బ జాతీయ నాయకుడు బుర్స పోచయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్క బాపూరావు, గిన్నెరా రాయిసెంటర్ ఉపామెడి కుంరం లక్ష్మన్, జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్క చిత్రు, మల్లాపూర్ సర్పంచ్ కనక దుందేరావు, కమిటీ సభ్యులు దుర్వ కృష్ణ, మెస్రం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.