పూల సాగు..ఆదాయం భలే

10-10-2026 | 11:53am

బెజ్జూర్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని ఎలుకపల్లి గ్రామంలో రైతు కొట్రంగి వెంకటి బంతిపూల సాగు (Marigold Cultivation) చేపడుతున్నారు. గత రెండేళ్లుగా రెండు ఎకరాల్లో రెండు రకాల బంతిపూలను సాగు చేస్తున్నట్లు రైతు తెలిపారు.దసరా పండుగ వచ్చిందంటే చాలు.. బతుకమ్మ పండుగ కోసం మహిళలు పెద్ద ఎత్తున పూలను కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ పూలకు (Bathukamma Flowers) ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు ఎకరాల్లో బంతిపూల సాగు చేపట్టినట్లు వెంకటి వివరించారు.

తాను సాగు చేసిన బంతిపూలను కాగజ్‌నగర్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కిలో బంతిపూలను రూ.100 చొప్పున విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. పూల విక్రయాలకు (Flower Sales) మంచి అవకాశాలు ఉండటంతో సాగు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.బంతిపూలు కావాల్సిన రైతులు, కొనుగోలుదారులు తన సెల్‌ఫోన్ నంబర్ 93908 24398 ను సంప్రదిస్తే పూలను సిద్ధంగా ఉంచుతామని రైతు కొట్రంగి వెంకటి తెలిపారు.

మరిన్ని వార్తలు