మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు కేటాయింపు
ప్రభుత్వానికి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ దండే విఠల్ కృతజ్ఞతలు
ఆసిఫాబాద్ (విజయక్రాంతి):హైదరాబాద్‌లోని కోకాపేటలో మున్నూరు కాపు ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించడంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్(MLC Dande Vithal) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కల్చరల్ సెంటర్‌లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మున్నూరు కాపు సంఘం అభివృద్ధికి, ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.