లింగాపూర్‌లో పొలాల అమావాస్య

11-09-2026 | 12:31am

లింగాపూర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో పొలాల అమావాస్య పండుగను గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఎడ్లను రంగురంగులుగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. గ్రామ పటేల్ మెస్రం గంగు ఆధ్వర్యంలో తోరణం తెంపే కార్యక్రమం నిర్వహించారు.

లింగాపూర్‌లో 1960 నుంచి దళిత, బహుజన, ఆదివాసీ, లంబాడా వర్గాల ప్రజలు ఐకమత్యంతో పొలాల అమావాస్యను జరుపుకుంటున్నారని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ పండుగ గ్రామంలోని సోదరభావం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. మాన్కరి రాథోడ్ కవిందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ నాయక్ రాథోడ్ కిరణ్ కారోబారి, రాథోడ్ శివలాల్ సర్పంచ్, జాదవ్ రాజశేఖర్, భజన మండలి సభ్యులు, కవి గాయకులు, పటేల్‌లు, గ్రామ పెద్దలను శాలువాలతో సన్మానించారు.

మరిన్ని వార్తలు